ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బీ కన్నన్(69) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే వైద్యులు శస్త్రచికిత్సచేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. కన్నన్.. లెజండరీ డైరెక్టర్ భీమ్ సింగ్ కుమారుడు. ప్రముఖ ఎడిటర్ బీ లెనిన్ కు సోదరుడు. కన్నన్ తమిళంతో పాటు తెలుగు మలయాళ చిత్రాలకు కూడా కెమెరామెన్ గా పనిచేశారు. తమిళ […]