సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు సారథి, జగిత్యాల: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలని, నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. […]