సారథిన్యూస్, జనగామ: సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(20) కొంతకాలంగా సెల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులు అడుతున్నాడు. ఆర్థికపరిస్థితి బాగా లేకపోవడంతో వారు కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.