సారథి, రామాయంపేట/పెద్దశంకరంపేట/రామగుండం: జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అని నిజంపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు కొనియాడారు. సోమవారం బాబు జగ్జీవన్ రాం 114వ జయంతిని పురస్కరించుకుని మండలకేంద్రంలో కొత్త బస్టాండ్ ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గెరిగంటి లక్ష్మీ నర్సింలు, చల్మేడ ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, నందిగామ మాజీ […]