సారథి, వేములవాడ: కరోనా పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్ సౌకర్యం లేనివారు తాము ఉండడానికి వీలుగా వేములవాడ పట్టణంలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండొచ్చని ఇన్ చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్శ్రీరాములు తెలిపారు. సరైన సదుపాయం ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, హోం క్వారంటైన్ సదుపాయం లేని వారు ఈ ఐసొలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్ సెకండ్ వేడ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, […]