సామాజిక సారథి, జడ్చర్ల: మండలంలో ఇటుక బట్టీల యజమానితో చిత్రహింసలకు గురవుతున్నారని ఒడిశా వలస కూలీల ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవుడి గుట్ట సమీపంలో ఇరవైరోజుల క్రితం మాధవరావు అనే కాంట్రాక్టర్ ఇటుక బట్టీలను తయారు చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సుమారు 13మంది వలస కూలీలను తీసుకొచ్చారు. ఓ వలసకూలీ తమను ఇటుక […]