Breaking News

INSPECTIONS

ముమ్మరంగా వాహనల తనిఖీలు

ముమ్మరంగా వాహనల తనిఖీలు

సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.  ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.

Read More
seeds

నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే

సారథి న్యూస్, బిజినేపల్లి : రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠినచర్యలు తప్పవని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్​ హెచ్చరించారు. గురువారం ఆయన బిజినేపల్లిలోని కనక దుర్గ ఏజెన్సీ , శ్రీరామ ట్రేడర్స్ , వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాల్లో వ్యవసాయాధికారి నీతితో కలిసి తనిఖీచేశారు. లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. ప్యాకెట్ పై తయారీ తారీఖును , బిల్లును కచ్చితంగా సరి చూసుకోవాలని కోరారు.

Read More