సారథి న్యూస్, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా విజృంభిస్తున్నది, గత మూడురోజుల్లో 36 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా బుధవారం ఒక్కరోజు 12 మందికి కరోనా పరీక్షలు చేస్తే 12 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో టెస్టులను మరింత పెంచితే కేసులు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన రోగులను కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో […]