సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామ శివారులోని భీమ సముద్రం(చెరువు)లోని నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్న వట్టెం రిజర్వాయర్ హెచ్ఈసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పలువురు రైతులు బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని, అభ్యంతరం చెబుతున్న రైతులపై దౌర్జన్యానికి దిగుతున్నారని అందులో పేర్కొన్నారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. వినతిపత్రం అందజేసినవారిలో పోట్టాల బాబు, డొక్కా చెన్నయ్య, మ్యాతరి […]