సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా బారినపడిన 44 మంది పోలీస్కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి హెల్త్కిట్లు ఆదివారం పంపిణీ చేశారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇలాంటి హెల్త్ కిట్స్ పంపిణీ చేసిన ఎస్పీకి పోలీసులు, వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పోషకాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చన్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలని ఎస్పీ సూచించారు.