సారథి న్యూస్, నర్సాపూర్: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా గొడ్డలితో అతిదారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన బుధవారం మెదక్జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగళ్ల నర్సమ్మ(65)కు నలుగురు కొడుకులు ఉన్నారు. చిన్నకొడుకు నర్సింలు అలియాస్ నర్సింగరావు కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు […]