సారథి న్యూస్, హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. బర్త్డే, పెండ్లి రోజు, ఇతర శుభదినాల్లో మొక్కలు నాటాలని కోరారు. బుధవారం కోహెడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరించడంతో పర్యావరణం రోజురోజుకు కలుషితమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సీఐ రఘు, ఎస్సై రాజుకుమార్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.