సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఓ సీఐ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు శుక్రవారం కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ఫిర్యాదు చేసింది. ఈనెల 15న ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న సదరు మహిళ.. కేసు విచారణలో ఉండగానే సీఐ బెదిరింపుకు ప్పాడుతున్నాడని ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని, సీఐ నుంచి రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.