సారథి, పెద్దశంకరంపేట: హనుమాన్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని తిరుమలాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, పెద్దశంకరంపేట రామాలయం లో భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. కరోనా వేళ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ పూజారి రంగాచారి ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జనగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి: దేశంలో భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లుతోందని హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మతపెద్దల సమావేశంలో మాట్లాడారు. పల్లె నుంచి పట్నం వరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించి పండుగలను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవడమే కాకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. రామనవమి, రంజాన్, మహావీర్ హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు, తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని […]