వాషింగ్టన్: హెచ్ – 1 బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఫెడరల్ ఏజెన్సీలు ఫారెన్ వర్కర్స్‌ను నియమించకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా హెచ్–1బీ వీసాలో ఉన్న వారిని కంపెనీ నియమించకోకూడదు. దీంతో యూఎస్ జాబ్ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న మన ఐటీ నిపుణులకు పెద్దదెబ్బ కానుంది. […]