న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్తంగా యోగా సెంటర్లు, జిమ్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ 19 కంటైన్‌మెంట్ జోన్లలో యోగా సెంటర్లు, జిమ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు. అలాగే 65 ఏళ్లు దాటినవారు, గర్భిణులు, 10ఏళ్ల లోపు పిల్లలు వెంటిలేషన్ లేని జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం కచ్చితంగా […]