సారథిన్యూస్, హైదరాబాద్: జీవీకే గ్రూప్ అధినేత జీవీ కృష్ణారెడ్డి, అతడి కుమారుడు సంజయ్రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణలో వీరు అవకతవకలకు పాల్పడ్డట్టు వీరిపై అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ. 705 కోట్ల మేర వీరు అక్రమాలకు పాల్పడ్డట్టు సమాచారం. ముంబై విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం జీవేకే సంస్థ మియాల్తో ఒప్పందం కుదుర్చుకున్నది. కాగా 2017లో బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సమాచారం.