తమిళ హీరో విష్టు విశాల్‌ను బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లాడనున్నారు. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం విష్ణు ట్విట్టర్లో ఫొటోలు షేర్ చేశాడు. రెండేళ్ల నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే జ్వాలను తాను పెళ్లిచేసుకోబోతున్నట్టు విష్ణు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘జ్వాలా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం ఆశావహ దృక్ఫథంతో ముందుకెళదాం. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.