Breaking News

GUTKA PACKETS

నిషేధిత గుట్కాల పట్టివేత

నిషేధిత గుట్కాల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు బెజ్జంకి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో పొగాకు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా రూ.42,800 విలువైన అంబర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన పొగాకు గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఏ.సంతోష్, ఎం.రమేష్, డి.నాగరాజు, ఎండీ మసూద్ హైమద్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Read More