సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మదొడ్డి గ్రామంలో వైద్యాధికారులు 42 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో నలుగురికి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా టెస్టులు చేసిన వారిలో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎల్టీ శ్రీనివాసరావు, రాజేష్, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లలిత కుమారి, కోటిరెడ్డి ఉన్నారు.