సారథి న్యూస్, చొప్పదండి: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రమాంలోని శివారుప్రాంతం నుంచి సాంబయ్యపల్లి వెళ్లే కమాన్వరకు తారు రోడ్డు లేకపోవడంతో మట్టిరోడ్డు గుంతలుగా మారింది. గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం కోసం నిత్యం కంకర సరఫరా చేసే లారీలతో రద్దీగా మారడంతో రోడ్డంతా గుంతల మయం అయింది. దీంతో ఎప్పుడ ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ రోడ్డుపై అనేకప్రమాదాలు జరిగాయి. అధికారులు దృష్టిసారించి […]