న్యూఢిల్లీ: యువనేత హార్థిక్పటేల్ కు కాంగ్రెస్పార్టీ కీలకపదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. హార్థిక్ను గుజరాత్ పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్గా నియమించారు. 26 ఏండ్ల హార్థిక్పటేల్ పిన్న వయసులో రాజకీయరంగప్రవేశం చేశారు. గుజరాత్లోని బలమైన సామాజికవర్గమైన పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటం దేశరాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అప్పటివరకు బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న పాటిదార్లు ఆపార్టీకి దూరమై హర్థిక్ వెంట నడిచారు. హార్థిక్కు కీలకపదవిని అప్పజెప్పి గుజరాత్లో బలపడేందుకు కాంగ్రెస్ పావులు […]