సారథి న్యూస్, హైదరాబాద్: గవర్నర్ తమిళ్సై సౌందర్‌రాజన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు.. తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించారు. అనంతరం తమిళ్సై బాబాయ్ మృతిచెందడంతో ముఖ్యమంత్రి పరామర్శించారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్ సభ సభ్యుడు వసంత కుమార్ కరోనాతో ఇటీవల కన్నుమూసిన తెలిసిందే. వసంత కుమార్ ప్రస్తుతం తమిళనాడు […]