Breaking News

goplaraopet

సర్పంచ్ ఔదార్యం

సర్పంచ్ ఔదార్యం

సారథి, రామడుగు: ఆపదలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడి పట్ల సర్పంచ్ ఔదార్యం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు రేణిగుంట రాజమల్లయ్య శనివారం అనారోగ్యానికి గురైయ్యాడు. ఆయనను వెంటనే కరీంనగర్ ​సిటీ దవాఖానకు తరలించగా ట్రీట్​మెంట్​ పొందుతున్నాడు. గోపాల్​రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న వెంకట్రామిరెడ్డి శనివారం రాజమల్లయ్యను పరామర్శించి రూ.15వేలు అందజేశారు. వైద్యచికిత్సల కోసం అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Read More