సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగళపూర్ గ్రామంలో పల్లెప్రగతి 4వ విడత, 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గుండ రమ్య పలు రకాల పూలజాతుల మొక్కలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇస్తున్న ఆరు మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్, ఏపీఎం త్రివేణి, టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ గుండ గంగయ్య, సీఏ గాయత్రి, బి.శేఖర్, పి.హరీశ్,గ్రామస్తులు పాల్గొన్నారు.
సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే వెంకటేశ్వర నేత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, మాజీ ఎంపీపీ హనుమాండ్లు, జగిత్యాల జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ మారంపల్లి బాబు, రాపల్లి సర్పంచ్ నల్ల శ్యాం, సెక్రటరీ సురమల్ల సతీష్, రత్నం, రాజయ్య మాణిక్యం, ప్రకాష్, శ్రీనివాస్, జంగిలి ఎల్లయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.