రన్నింగ్ ట్రాక్ లో స్వర్ణాల పంట అవరోధాలను అవకాశంగా మల్చుకున్న హిమదాస్ అద్భుతాలను ఆశించలేదు.. కానీ అవకాశాలను అందుకుంది. ఉవ్వెత్తు కెరటంలా ఎగిసి పడలేదు.. కానీ నిలకడగా విజయాల సెలయేరును ప్రవహింపచేసింది. అవరోధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ అలుపెరగని పోరాటంతో అక్కున చేర్చుకుంది. గమ్యం మారే సమయంలో గమనాన్ని నమ్ముకుంది. గోల్ పోస్ట్‌పై పెట్టిన గురిని ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. బురదలో పరుగెత్తిన కాళ్లతో పరుగు పందానికి స్వర్ణాల బాట వేసుకుంది. తొలి యవ్వనంలో తొలకరి మేఘంలా […]