Breaking News

GENCO

రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

సారథి న్యూస్, పాల్వంచ: శ్రీశైలం ఎడమ గట్టు పవర్​హౌస్​ ప్రమాదంలో మృతిచెందిన విద్యుత్​శాఖ ఉద్యోగుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) డిమాండ్ ​చేశారు. ఇటీవల పవర్ హౌస్​లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పాల్వంచ ఇందిరా నగర్ కాలనీకి చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్​ కిరణ్​ కుమార్​ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. కేంద్ర […]

Read More
ఉద్యోగులను కాపాడుకోలేకపోయాం..

ఉద్యోగులను కాపాడుకోలేకపోయాం..

శ్రీశైలం పవర్​హౌస్ ​ఘటన చాలా దురదృష్టకరం బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సాయం విచారం వ్యక్తంచేసిన విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి బయలుదేరి సంఘటన స్థలికి 2.30 గంటలకు చేరుకున్నా ఉద్యోగులను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జెన్​కో పవర్​హౌస్​లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన జెన్​కో ఉద్యోగుల పార్థివదేహాలను […]

Read More
అగ్నికీలల్లో 9 మంది

అగ్నికీలల్లో 9 మంది

శ్రీశైలం పవర్ హౌస్​ ​మంటల్లో చిక్కుకుని మృత్యువాత తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశాలు సారథి న్యూస్, అచ్చంపేట: ఎటుచూసినా చిమ్మ చీకటి.. చుట్టూ దట్టమైన పొగలు.. ఎక్కడ చిక్కిన వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. తెలంగాణ పరిధిలోని పాతాళగంగ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 9మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు డీఈ, నలుగురు ఏఈ స్థాయి అధికారులు ఉన్నారు. మిగతావారు సిబ్బంది ఉన్నారు. జెన్‌కో మొదటి యూనిట్‌లోని […]

Read More