సారథి, వాజేడు: ములుగు జిల్లా మూరుమూరు పంచాయతీ గణపురంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యమున గ్రామంలో బాలింతలు గర్భిణులు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, సర్పంచ్, సెక్రటరీ, వైద్యసిబ్బంది కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశా కార్యకర్త, అంగన్ వాడీ టీచర్ పాల్గొన్నారు.