న్యూఢిల్లీ: బ్యాట్స్‌మెన్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా కెప్టెన్‌గా సాధించింది ఏమీ లేదని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. కెరీర్లో సారథిగా చాలా సాధించాల్సి ఉందన్నాడు. అతిముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే.. గొప్ప కెప్టెన్ల జాబితాలో చోటు దక్కుతుందన్నాడు. చూడటానికి టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. అధిగమించాల్సిన బలహీనతలు కూడా ఉన్నాయన్నాడు. ‘జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలే మెగా ఈవెంట్లలో రాణించడానికి […]