జైపూర్: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆడియోలో ఉన్న గొంతు అతనిదే అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఐదు ప్రశ్నలు సందించారు. ‘గజేంద్ర సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన గురించి తెలిసిన వాళ్లే అది ఆయన వాయిస్ అని గుర్తుపట్టారు. అలాంటిది ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? […]