సారథి న్యూస్, కర్నూలు: రైతులకు మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్‌ను యథావిధిగా కొనసాగించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని గుర్తుచేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడం, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించాలని జీవో తీసుకురావడం బాధాకరమన్నారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కె.పెద్దారెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ […]