సారథి న్యూస్, ములుగు: వేసవికాలంలో అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. వేసవిలో ఏర్పడే కార్చిచ్చు ద్వారా అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించామని స్పష్టంచేశారు. నాలుగు డివిజన్ల పరిధిలోని 14 అటవీక్షేత్రాల్లో కంపార్ట్మెంట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు పనులు చకచకా కొనసాగుతున్నాయి వెల్లడించారు. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ప్రతి అటవీక్షేత్రం పరిధిలో ఐదుగురు ప్రత్యేక సభ్యులతో క్విక్ రెస్పాన్స్ టీం […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లాలోని వాజేడు మండలం చికుపల్లి అటవీ పాంత్రంలో ఉన్న బొగత జలపాతాన్ని వెంకటాపురం రేంజ్ ఆఫీసర్, వాజేడు ఎస్సై తిరుపతి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బొగత జలపాతానికి వచ్చే పర్యాటకులు అటవీ అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి కట్టుకుని బొగత జలపాతం సందర్శనకు రావాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]