సారథి న్యూస్, రామగుండం: చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫారెస్ట్అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని, శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్, అడవిశాఖ […]