44మంది విద్యార్థినులకు అస్వస్థత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సాంఘిక శాఖ సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం స్కూలులో బ్రేక్ పాస్ట్ లో పులిహోర తిన్న విద్యార్థినులు టిఫిన్ చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులకు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. […]