సారథి న్యూస్, రామాయంపేట: చెరువుల్లోని చేపలపై తొలి హక్కులు బెస్త, గంగపుత్రులకే చెందేలా రాష్ట్ర గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాలని చల్మేడ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు మంగలిపల్లి శ్రీనివాస్, మంగిలిపల్లి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మత్స్యకారుల మెడ మీద కత్తిలా మారిన జీవోలను రద్దుచేయాలన్నారు. ఉచిత చేపపిల్లలకు బదులుగా అంతే మొత్తంలో డబ్బును సొసైటీ ఖాతాలో జమచేస్తే మంచి నాణ్యమైన చేపలను […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితంలో వెలుగులు నింపాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని పశువర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీసు ఆవరణలో మొబైల్ ఫిష్ అవుట్ లెట్ ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 […]