సారథి: పెద్దశంకరంపేట: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను పెద్దశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అపరచాణిక్యుడు, కార్యదక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అన్నారు. హరీశ్ రావు లాంటి నేత తెలంగాణలో పుట్టడం […]