ఇప్పటికే వరుస హిట్లతో నంబర్‌వన్‌గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్గా చాన్స్ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్‌కల్యాణ్.. హరీశ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఓ పవర్ఫుల్ కథను హరీశ్ వినిపించగా.. పవన్‌కల్యాణ్‌కు నచ్చిందట. ఇందులో పవర్‌స్టార్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రను పోషించనున్నట్టు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.