న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 69,652 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకున్నది. కాగా ఇప్పటివరకు 20,96,664 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 58,794 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటివరకు 53,866 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 6,86,395 మంది చికిత్స పొందుతున్నారు.