Breaking News

eturunagaram

స్తంభమెక్కి యువకుడి హల్​చల్​

స్తంభమెక్కి యువకుడి హల్​చల్​

సారథి న్యూస్, ఏటూరునాగారం: ఓ యువకుడు కరెంట్​ స్తంభం ఎక్కి హల్​చల్​ సృష్టించాడు. శుక్రవారం ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపురం గ్రామంలో సంచలనం రేకెత్తించింది. ఇదే గ్రామానికి చెందిన సాబీర్ కన్నాయిగూడెం మండలంలోని ఆర్​డబ్ల్యూఎస్​ సంస్థలో దినసరి కూలీగా పనిచేసేశాడు. ఆరునెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంట్లో కుటుంబ అవసరాల కోసం భార్యతో గొడవ జరిగేది. దీంతో మనస్తాపానికి గురైన సాబీర్ మద్యం తాగి విద్యుత్ స్తంభం ఎక్కి సూసైడ్​ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇదిలాఉండగా, […]

Read More
క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

సారథి న్యూస్, వాజేడు: మండలంలోని కొంగల గ్రామంలో జగన్నాథపురం సబ్ సెంటర్ లో ఏసీఎఫ్ క్యాంపు నిర్వహించారు డాక్టర్ యమున. ఈ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం, తేమడతో రక్తంపడడం, ఆకలి మందగించడం వంటి వారిని గుర్తించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కార్యక్రంమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర రావు, సర్పంచ్ శివరామకృష్ణ, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎస్టీఎస్ వెంకటేశ్వరరావు, ఎస్.రవి, ఎల్ టి.రజినీకాంత్ పాల్గొన్నారు.

Read More
వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

సారథి న్యూస్, ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని నార్త్ రేంజ్ పరిధిలోని భూపాతిపూర్ బీట్, గురవేళ్ల బీట్లో నూతనంగా నిర్మిస్తున్న పెర్కోలేషన్ ట్యాంక్ పనులను డీ ఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి శుక్రవారం పరిశీలించారు. పనులు పూర్తి వెంటనే సోలర్ బోర్‌వెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో టైగర్ తిరిగిన ప్రదేశం కావునా ఇక్కడ కెమెరా ట్రాప్స్ నిఘా పెంచాలన్నారు. అలాగే వన్యప్రాణుల కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఎఫ్ డీవో వీణావాణి ఉన్నారు.

Read More