సారథి న్యూస్, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ టెస్టు రేటును రూ.2,200గా నిర్ణయించినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఒక్కోరోజుకు వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500, వెంటిలేటర్‌పై ఉంచితే రూ.9వేలు ఛార్జీ వసూలు చేస్తారని చెప్పారు. కరోనాపై ఉన్నతస్థాయిలో నిత్యం సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ చెప్పిందన్నారు. కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయబోరని, లక్షణాలు ఉన్నవారికే టెస్టులు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు.