Breaking News

ENGLAND

వెస్టిండీస్ క్రికెటర్లు వచ్చేశారు..

మాంచెస్టర్‌: అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు ఇంగ్లండ్, వెస్టిండీస్ మరో అడుగు ముందుకేశాయి. మూడు మ్యాచ్ ల సిరీస్ కోసం విండీస్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టింది. కరోనా నేపథ్యంలో మరో జట్టు వేరే దేశంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. రిజర్వ్ టీమ్, సహాయక సిబ్బంది మొత్తం మాంచెస్టర్ చేరుకున్నారు. కరీబియన్ దీవుల్లో ఉన్న ఆటగాళ్లందర్ని రెండు ప్రైవేట్ విమానాల్లో అంటిగ్వాకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అక్కడి నుంచి స్పెషల్ […]

Read More

తొలి టెస్టు​కు రూట్ అనుమానమే

లండన్: వెస్టిండీస్​తో జరిగే తొలి టెస్ట్​కు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అందుబాటులో ఉండడంపై సందిగ్దం నెలకొంది. జులై 8 నుంచి 12వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో డెలివరీ సమయంలో భార్య వద్ద ఉండాలనే అభిప్రాయంతో రూట్ ఉన్నాడు. దీనికోసం అతను సెలవు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇది పూర్తయిన తర్వాత రూట్ టీమ్​తో చేరాలంటే క్వారంటైన్ నిబంధనలు […]

Read More
ఇంగ్లండ్‌ పర్యటనకు రాం

ఇంగ్లండ్‌ పర్యటనకు రాం

సెయింట్‌ జాన్స్‌ (అంటిగ్వా): కరోనా నేపథ్యంలో.. వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు తాము రాలేమని వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్ మెయర్, కీమో పాల్ వెల్లడించారు. దీంతో వీళ్లను పక్కనబెట్టి ఈ సిరీస్ కోసం 14 మందితో కూడిన వెస్టిండీస్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ముగ్గురు క్రికెటర్ల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని విండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) తెలిపింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ బోనెర్, పేసర్ కెమెర్ హోల్డర్ తొలిసారి విండీస్ […]

Read More

కరోనా సబ్​ స్టిట్యూట్​ ను ఇవ్వండి

లండన్: కరోనా దెబ్బకు కుదేలైన క్రికెట్​ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్నిదేశాల బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైరస్ బారినపడకుండా ఆటలో కొన్ని మార్పులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుపుతోంది. వెస్టిండీస్, పాకిస్థాన్​తో జరగబోయే టెస్ట్ సిరీస్​ ‘కరోనా సబ్​ స్టిట్యూట్​’ను ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్ట్​ల్లో కంకూషన్ సబ్​ స్టిట్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు కరోనావ్యాప్తి నేపథ్యంలో ఎవరైనా ప్లేయర్ కు కొవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ల స్థానంలో […]

Read More

ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు

ఈసీబీ సన్నాహాలు లండన్‌: అంతర్జాతీయ క్రికెట్​ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్​ డోర్ ట్రైనింగ్​ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్​తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ […]

Read More

ఫార్మాట్‌ బట్టి కోచ్‌

ఆసీస్‌ మాజీ కోచ్‌ డారెన్‌ లీమన్‌ లండన్‌: అసలే బిజీ షెడ్యూల్‌.. ఆపై ఎక్కువగా ప్రయాణాలు.. మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్‌ ఉంటే.. ఏడాదిలో ముప్పావు భాగం బయటే గడపాల్సిన పరిస్థితి.. ఈ నేపథ్యంలో కోచింగ్‌ వ్యవస్థను విడదీయాలని ఆసీస్‌ మాజీ కోచ్‌ డారెన్‌ లీమన్‌ అన్నాడు. అందుకు ఇదే సరైన సమయమని, భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌ మరింత ముందుకెళ్లాలంటే ఇలా చేయాలని సూచించాడు. ఆయా ఫార్మాట్లను బట్టి ప్రత్యేక కోచ్‌లను నియమిస్తే ఒత్తిడి, బరువు […]

Read More

ధోనీలో ఆ కసి లేదు

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లాండ్​తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్​లో భారత్ జట్టు గందరగోళంగా ఆడిందని ఆల్​ రౌండర్​ బెన్ స్టోక్స్ అన్నాడు. లక్ష్యఛేదనలో సూపర్ ఫినిషర్ ధోనీలో కసి కనిపించలేదన్నాడు. ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ 337/7 స్కోరు చేస్తే.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. ‘ఈ మ్యాచ్​ మొత్తంలో ధోనీ, జాదవ్ బ్యాటింగ్ వింతగా అనిపించింది. ఈ ఇద్దరిలో ఏమాత్రం కసి కనిపించలేదు. భారీ సిక్సర్ల కొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీయడంపై దృష్టిపెట్టారు. 11 ఓవర్లలో 112 […]

Read More

కోహ్లీ.. గడ్డం తీసేయ్!

న్యూఢిల్లీ: లాక్ డౌక్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇవి కొన్నిసార్లు సానుకూలంగా ఉంటే.. మరికొన్ని ఆటగాళ్ల మధ్య విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. గతంలో తీసుకున్న ఓ ఫొటోను కోహ్లీ ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన పీటర్సన్.. ‘నీ గడ్డం తీసేయ్ కోహ్లీ’ అంటూ […]

Read More