సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు పెద్ది వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ట్యాంక్ బండ్ పై అమరుడి విగ్రహం లేకపోవడం విచాకరమన్నారు. దొడ్డి కొమురయ్య భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై […]
సారథి, గొల్లపల్లి: తెలంగాణ సాయుధ పోరాటవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల దురాగతాలు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా భీకరమైన సాయుధ పోరాటంలో తెలంగాణ గడ్డపై ఒరిగారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేష్, ఉపసర్పంచ్ మారం శేఖర్, […]