ఘాట్‌రోడ్డులో ఘోరప్రమాదం నలుగురు దుర్మరణం 19 మందికి గాయాలు బాధితులు హైదరాబాద్ వాసులు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు ఐదో నంబర్ మలుపు వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మందికి గాయాలైనట్లు అనంతగిరి ఎస్సై తెలిపారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి […]