న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఢిల్లీ పాటించిన మోడల్ గురించి ప్రతిచోట చర్చించుకుంటున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య పదివేల కంటే తగ్గిందన్నారు. ఢిల్లీ పౌరులను చూసి గర్వపడుతున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలో యాక్టివ్ కేసులు 10వేల కంటే తక్కువ ఉన్నాయి. యాక్టివ్ కేసుల్లో ఢిల్లీ 14వ స్థానానికి చేరింది. కరోనా మరణాలు 12కి తగ్గాయి. ఢిల్లీ ప్రజలను చూసి నేను గర్వపడుతున్నాను. ఢిల్లీ మోడల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. […]