డెహ్రాడూన్: కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. నాలుగు జిల్లాల్లో శని, ఆదివారాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్‌సింగ్ నగర్, నైనిటాల్లో లాక్డౌన్ కొనసాగనున్నది. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి, వ్యవసాయపనులకు, నిర్మాణరంగ పనులకు మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలు, హోటల్లు తెరుచుకోవచ్చు. అయితే మిగతా ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మూసేయాల్సిందే. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]