న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలుకంపెనీలు భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాయి. ఇప్పటికే […]