సారథి, వేములవాడ: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం, తెలంగాణ చౌక్ వద్ద షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ లో రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ప్రతి దళిత కుటుంబానికి ఈనెల 30వ తేదీలోపు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి […]