సారథి, చొప్పదండి: టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ.. వారిని వంచనకు గురిచేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం విమర్శించారు. మంగళవారం చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో దళితబంధు అంటూ మరో కొత్త నాటకానికి తెరదీశారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, లేకపోతే దళితులంతా […]