సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జల్లాపురం స్టేజీ వద్ద నకిలీ పత్తి విత్తనాలను సంబంధిత అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్కడే ఉన్న మహాలక్ష్మీ హోటల్ లో 46 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను నిల్వచేసినట్లు తెలియడంతో వ్యవసాయాధికారి శ్వేత తనిఖీచేశారు. వాటిని సీజ్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేఖర్ అనే వ్యక్తి ఈ హోటల్ ను అడ్డాగా చేసుకుని సీడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని ఎస్సై ఎం.సంతోష్ కుమార్ దర్యాప్తు […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర సర్కార్ నియంత్రిత పంటసాగు విధానం ద్వారా రైతులు పత్తి, కంది పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించిన కొద్దిరోజులకే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని పలు మండలంలో నకిలీ పత్తి విత్తనాలు దందా జోరుగా కొనసాగుతోంది. నారాయణఖేడ్ మండలంలోని ఆబ్బెంద గ్రామం, కంగ్టి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గోకులకృష్ణ సీడ్స్ పేరుతో నాసిరకం పత్తి విత్తనాలు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మార్పీ లేకుండా ఉన్న […]
సారథి న్యూస్, గోదావరిఖని: రైతులకు నకిలీ సీడ్స్ విక్రయించే వారిపై చర్యలు తప్పవని, అటువంటి వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో వాటిని అమ్మాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. లాక్ డౌన్ సమయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ […]