Breaking News

COOPARATIVE BANKS

ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

న్యూఢిల్లీ: సహకార బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 1,482 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఇక ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.

Read More